నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

66చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఖమ్మం నగరంలోని 33/11 ఎన్ఎస్పీ సబ్ స్టేషన్ 11 కేవీ రాపర్తినగర్ పరిధిలో విద్యుత్ లైన్లకు ఆటంకంగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపు కారణంగా సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని టౌన్-3 ఏఈ తావుర్యా ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో బైపాస్ రోడ్, ఆర్ఆర్ స్కూల్, కొత్త బస్టాండ్, రాపర్తినగర్ తదితర ప్రాంతాల్లో కరెంట్ ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్