ఈ నెల 15 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు

69చూసినవారు
ఈ నెల 15 నుంచి ఎస్ఏ-2 పరీక్షలు
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకు సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ-2) పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ సోమశేఖరశర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలోని 1నుంచి 9వ తరగతి విద్యార్థులకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను యాజమాన్యాలు, హెచ్ఎంలు ఎంఆర్సీల నుంచి తీసుకెళ్లాలని సూచించారు. కాగా, 1నుంచి 7వ తరగతుల విద్యార్థులకు ఉదయం 9నుంచి 11-30 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.