కేఎంసీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం

64చూసినవారు
కేఎంసీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా ఉద్యోగులు సహకరించాలని కోరారు. ఉద్యోగులకు, నగర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, సహాయ కమిషనర్ సంపత్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.