రఘురాం రెడ్డికే మా మద్దతు

1068చూసినవారు
రఘురాం రెడ్డికే మా మద్దతు
విద్వేషాలు, విషపూరిత కుట్రలను నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాల దైవ సేవకుల సంఘం బాధ్యులు తెలిపారు. శనివారం ఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగిన సదస్సులో వారు మాట్లాడారు. మతతత్వ కల్లోలాలను నిలువరించేందుకు లౌకికవాద కాంగ్రెస్ కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్బంగా రఘురాంరెడ్డి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డిని శాలువాతో సత్కరించారు.