మధిర మండలం - Madhira Mandal

మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఖమ్మం జిల్లా మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డిల ఆధ్వర్యంలో ఢిల్లీలో గత నలబై రోజులుగా కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు మద్దతుగా అల్ ఇండియా యూత్ కాంగ్రెస్స్ పిలుపు మేరకు మోడి దిష్టి బొమ్మను దహనం చేయటం జరిగింది. ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు గొడ్డు చలిలో 40 రోజులుగా ఆ చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేస్తుంటే దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తోంది అని విమర్శించారు.నిరంకుశ విధానాలు విడనాడి రైతులకు మేలు జరిగేవిదానాలు అవలంబించాలని కోరారు ఈ సందర్భంగా అద్దంకి రవి కుమార్ మాట్లాడుతూ కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు బిల్లులను రద్దు చేయకుంటే భవిష్యత్ కార్యాచరణలో భాగంగా యూత్ కాంగ్రెస్ అద్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కేంద్రం మెడలు వంచేవిధంగా పోరాటం చేస్తాంమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంపా వెంకటేస్వశరరెడ్డి, కోరంపల్లి చంటి పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.