దేశినేనిపాలెంలో జాతీయ జెండా ఎగరవేసిన సర్పంచ్

271చూసినవారు
దేశినేనిపాలెంలో జాతీయ జెండా ఎగరవేసిన సర్పంచ్
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని దేశినేనిపాలెం గ్రామ పంచాయితీ కార్యాలయం నందు శనివారం 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవుల ఝాన్సీ కిరణ్ ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను గ్రామ సర్పంచ్ ఆవుల ఝాన్సీ కిరణ్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరిటాల రామకృష్ణ, గ్రామ సెక్రటరీ నిర్మల, వార్డు సభ్యులు, గ్రామ దీపిక, ఆశా వర్కర్, స్కూల్ టీచర్స్, గ్రామ పెద్దలు ఆవుల కిరణ్ కుమార్ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్