ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని ఆత్కూరు గ్రామ పంచాయతీ ఆఫీసు నందు శనివారం 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అబ్బూరి సంధ్యా రామకృష్ణ మాట్లాడుతూ... స్వాతంత్య్రం అనేది ఎందరో మహానుభావులు త్యాగపాలం అని ఆ మహనీయులను కొనియాడారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిట్టిబాబు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, ఆశా వర్కర్లు మరియు పంచాయితి సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.