బాణాపురంలో పనిచేయని సీసీ కెమెరాలు

66చూసినవారు
బాణాపురంలో పనిచేయని సీసీ కెమెరాలు
ముదిగొండ మండలం బాణాపురంలో గ్రామ పెద్దల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గతంలో ఐజీ నాగిరెడ్డితో ప్రారంభించారు. ఈ సీసీ కెమెరాలు ద్వారా తెలంగాణలో సంచలనం సృష్టించిన సూది మందు నిందితుడిని పట్టుకున్నారు. తరచూ దొంగతనాలు జరుగుతున్నా సీసీ కెమెరాల గురించి పట్టించుకునే నాథుడే లేడని గ్రామస్థులు చెబుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్