ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం మధిర మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.