ఖమ్మం జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు తాత మధు ఆధ్వర్యంలో ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొని మాట్లాడుతూ. మధిర శాసన సభ్యులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజా పాలన ముసుగులో మధిర ను పైలెట్ ప్రాజెక్టుగా మారిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.