ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని ఎర్రుపాలెం, మధిర, ముదిగొండ, చింతకాని, బోనకల్ మండలంలో బుధవారం స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దేశానికి వారు చేసిన సేవల గురించి కొనియాడారు.