మధిర టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు ఎంఈఓ ప్రభాకర్ తెలిపారు. కాగా శుక్రవారం నిర్వహించిన జూనియర్ గర్ల్స్ కబడ్డీ పోటీల్లో హరిజనవాడ హైస్కూల్ విద్యార్థులు విజయం సాధించారు. వీరికి మండల విద్యా శాఖ అధికారులు షీల్డ్ తో పాటు ప్రశంస పత్రాలను అందజేశారు. విజయం సాధించిన జట్టుకు వారు శుభాకాంక్షలు తెలిపారు.