మధిర మండల పరిధిలోని మడుపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మంగళవారం జేఎన్టీయూ రిజిస్టార్ వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తోట నరసింహారావు ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వారిని ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదువుకొని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.