ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని దెందుకూరు గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం జిల్లా బాలల పరిరక్షణ విభాగం సామాజిక కార్యకర్త నంద్యాల హరిప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపిల్లలను రక్షిద్దాం- చదివిద్దాం అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.