గుంతలు పూడ్చిన మోహన్

74చూసినవారు
గుంతలు పూడ్చిన మోహన్
ముదిగొండ-సువర్ణాపురం రహదారిపై వారం రోజుల క్రితం ఏర్పడిన గుంతల వల్ల విద్యార్థులు, ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై మంగళవారం సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ కు కనపర్తి మోహన్ బుధవారం స్పందించారు. సువర్ణాపురం గ్రామానికి చెందిన పసుపులేటి దేవేందర్, కొమ్మినేని రమేష్ బాబు సూచనల మేరకు వెంటనే స్పందించి తనవంతు బాధ్యతగా కనపర్తి మోహన్ తన సొంత జెసిబి, ట్రాక్టరుతో కంకర, రాయి తీసుకొవచ్చి ఆ గుంతలను పూడ్చారు.

సంబంధిత పోస్ట్