ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీరామ్ నగర్ నందు ఇటీవల మంచినీటి పంపులు ఉన్నటువంటి ప్రాంతంలో నూతన విద్యుత్ స్తంభాలు వేయడం జరిగింది. దీంతో భూమిలో మంచినీటి పంపులు పగిలిపోయి నీరంతా వృధాగా పోతుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.