ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శివాలయం రోడ్డు నందు రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి డ్రైనేజీ నీరంతా రోడ్లపై చేరడంతో ఈ రోడ్డు కుండా ప్రయాణించే బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తమ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.