ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ట్యాంక్ బండ్ వద్ద బుధవారం సాయంత్రం నిలిపి స్టాండ్ వేసి నిలిపిన ద్విచక్ర వాహనం లోకి పాము దూరడం జరిగింది. ఈ విషయం తెలియని బైక్ యజమాని బైకు స్టార్ట్ చేయడానికి వెళ్ళగా ఒకసారి ఆ పామును చూసి భయభ్రాంతులకు గురయ్యాడు. దీంతో స్థానిక ప్రజల సహకారంతో పామును బయటికి తీయడంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.