ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని మోటమర్రి గ్రామంలో బుధవారం సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పాల్గొని ముగ్గుల పోటీలలోని విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.