ముదిగొండ: కారు-ఆటో ఢీ.. ఒక్కరికి గాయాలు
ముదిగొండ మండలం సువర్ణపురంలోని ఖమ్మం- కోదాడ జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. రోడ్డుపై వెళ్తున్న ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన ఆటో డ్రైవర్ ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.