నేలకొండపల్లిలో దంచి కొడుతున్న వర్షం
నేలకొండపల్లిలో దసరా పండుగ రోజు శనివారం మధ్యాహ్నం వాన దంచి కొడుతోంది. దసరా, పారువేట, శమీ పూజకు సిద్ధమవుతున్న తరుణంలో జోరు వర్షం కురుస్తోంది. విజయదశమి సందర్భంగా శ్రీఉత్తరేశ్వర స్వామి, శ్రీవెంకటేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాలస్వామి, రామదాసు మందిరం నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతున్నారు. ఈ నేపథ్యంలో వర్షం వలన కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.