నేలకొండపల్లి మండలంలో దేవీ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులకు ఎస్ఐ సంతోష్ కీలక సూచనలు చేశారు. గ్రామాల్లో దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసే కమిటీ నిర్వాహకులు ముందుగా పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. అదే విధంగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శోభయాత్రల సమయంలో డీజేకి అనుమతి లేదని ఎస్ఐ సంతోష్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.