పాలేరు ఎడమ కాలువ మరమ్మతు పనులు పరిశీలన

83చూసినవారు
పాలేరు ఎడమ కాలువ మరమ్మతు పనులు పరిశీలన
ఇటీవల వచ్చిన వరదలకు కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఎడమ కాలువకు గండి పడిన విషయం తెలిసిందే. దీంతో పూడ్చివేత పనులు జరుగుతుండగా, శనివారం మరమ్మతు పనులను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు బాగం హేమంతరావు పరిశీలించారు. త్వరితగతిన మరమ్మతు పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్