ఖమ్మం రూరల్ మండలం కన్నాతండా, వాల్యూతండా, తంగంపాడు గ్రామాల్లో ఇటీవల వచ్చిన భారీ వరదల వల్ల వరిపంటలు దెబ్బతిన్నాయి. శనివారం సిపిఎం పార్టీ జిల్లా నాయకులు భూక్యా వీరభద్రం వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకేరు వాగు వరదలతో సర్వం కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తక్షణం సహాయం అందించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పంట నష్టపరిహారం అంచనా వేయాలని డిమాండ్ చేశారు.