నేలకొండపల్లిలో జంట హత్య కేసుకు సంబంధించి అనుమానుతుడి ఫొటోలను స్థానిక పోలీసులు విడుదల చేశారు. రెండు రోజుల క్రితం ఓయువకుడు బైక్ పై వచ్చి చెత్తకుప్పలో సెల్ పడేసిన దృశ్యాలు ఎదురుగా ఉన్న దుకాణంలోని సీసీ పుటేజీలో వెలుగుచూశాయి. సెల్ ఫోన్ ను చెత్త కుప్పలో పడేసిన ఆ వ్యక్తినే అనుమానిస్తున్నామని, ఆ వ్యక్తి లేదా బైక్ ను గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ పి. సంతోష్ కోరారు.