జలగం నగర్ లో కుప్పలు తెప్పలుగా పాడైపోయిన వస్తువులు

57చూసినవారు
ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ గ్రామపంచాయతీ పరిధిలోని జలగం నగర్ ను మున్నేరు వరద ముంచేత్తింది. దీంతో కనివిని ఎరగని రీతిలో నష్టం జరిగింది. ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం తడిసి ముద్దయింది. దీంతో గత రెండు రోజులుగా స్థానికులు తమ ఇళ్లల్లోని పాడైపోయిన వస్తువులను ఇంటిముందు పడేస్తున్నారు. ఏ ఇంటి ముందు చూసిన కుప్పలు తెప్పలుగా పాడైపోయిన వస్తువు సామాగ్రి దర్శనమిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్