పాలేరు సమీపంలోని సాగర్ రెండో జోన్ పరిధిలో జిల్లా ఆయకట్టుకు అధికారులు నీటి విడుదలను నాలుగు వేల క్యూసెక్కులకు పెంచారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఆయకట్టుకు నీటి డిమాండ్ పెరగడంతో ఇరిగేషన్ అధికారులు ఆయకట్టుకు క్రమంగా నీటి ప్రవాహాన్ని పెంచుతున్నారు. పాలేరు జలాశయం నీటి మట్టం ప్రస్తుతం 18. 50 అడుగులు ఉంది. క్యాచ్ మెంట్ నుంచి 500 క్యూసెక్కుల, మొదటి జోన్ నుంచి 2, 067 క్యూసెక్కుల నీరు పాలేరు జలాశయానికి చేరుతోంది.