ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు. శుక్రవారం మధిర మండల తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి అర్జీల పరిష్కారం, ఓటరు జాబితా సవరణ పై రెవెన్యూ అధికారులతో మధిర నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.