యువరైతును హత్తుకొని ఓదార్చిన కేంద్రమంత్రి

85చూసినవారు
కూసుమంచి మండలం వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ పర్యటించారు. అనంతరం పాలేరు నవోదయ పాఠశాలలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక కోక్యాతండ గ్రామానికి చెందిన యువరైతు హలవత్ నరసింహారావు తమకు జరిగిన నష్టాన్ని వివరించి, అన్నదాతలు సర్వం కోల్పోయామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. భావోద్వేగానికి గురైన రైతును కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ హత్తుకొని‌ ఓదార్చారు.

సంబంధిత పోస్ట్