ఇసుక తరలిస్తున్న టాక్టర్ పట్టివేత

72చూసినవారు
ఇసుక తరలిస్తున్న టాక్టర్ పట్టివేత
తిరుమలాయపాలెం మండలం సోలిపురం గ్రామంలోని పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టాక్టర్ ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం టాక్టర్ యజమాని, డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్ తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్