బూర్గంపాడు మండలంలో దొంగలు అలజడి సృష్టించారు. గురువారం రాత్రి మూడుచోట్ల చోరీకి పాల్పడ్డారు. బూర్గంపాడుకి చెందిన రమాదేవి ఇంట్లో దొంగలు బీరువాలోని వెండి ఆభరణాలు, నగదు చోరీ చేశారు. అలాగే మోరంపల్లి బంజరుకు చెందిన ప్రదీప్ చారి ఇంట్లో బంగారం, వెండితో పాటు నగదు చోరీ చేశారు. ఇదే గ్రామానికి చెందిన భారతి ఇంట్లో నగదు అపహరించారు. దీంతో శుక్రవారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బూర్గంపాడు ఎస్ఐ వివరాలు సేకరించారు.