వేంసూర్: 12 ఏళ్ల బాలికపై 39 ఏళ్ల ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడగా దుస్తుల మీద నుంచి తాకితే లైంగిక వేధింపులు తప్పు కాదు అంటూ బాంబే హైకోర్టు తన తీర్పును ఇటీవల వెలువరించింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపట్ల టి యస్ యుటిఎఫ్ వేంసూరు మండలం మహిళా విభాగం విస్మయం వ్యక్తం చేసింది. ఒక మహిళా న్యాయమూర్తి అయిన జస్టిస్" పుష్ప గనేడివాలా " పై విధమైన తీర్పునివ్వడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.
స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఉన్నత న్యాయవ్యవస్థలు మరియు న్యాయమూర్తులు కూడా ఈ విధంగా నిందితులకు అనుకూలంగా తీర్పులివ్వడం వల్ల నేరస్తులకు భారత న్యాయ విధానం పట్ల భయం లేకుండా పోయింది. అలానే బాలికల, మహిళల రక్షణ కోసం చేయబడ్జ చట్టాలన్నీ భవిష్యత్తులో నిందితులకు అనుకూలంగా మారే ప్రమాదం వుందని ఏర్పడుతుందని వేంసూరు టి యస్ యు టియఫ్ మహిళా విభాగం భాద్యులు కోలేటి.నిర్మల కుమారి టి ఆర్ యస్ రాణి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తీర్పును పునఃసమీక్షించుకోవడం ఎంతైనా అవసరం ఉందని వారు సోమవారం ఒక ప్రకటన లో తీవ్రంగా ఖండించింది.