పుల్లయ్య బంజరలో రోడ్లపై వరద

60చూసినవారు
కల్లూరు మండలం పుల్లయ్య బంజర రోడ్డులోని 1, 3వ వార్డులు డ్రైనేజీ పొంగి పొర్లుపోతున్నాయి. దీంతో రోడ్డు మీదనే వరద నీరు పారడం, ఇళ్లలో మురుగు నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ పూడిక తీసివుంటే ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోవడం వల్లనే ఇలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని, సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్