వనాల్లో ఉండాల్సిన కోతులు జనాల్లోకి వస్తున్నాయి. రోడ్లపై గుంపులుగుంపులుగా తిష్టవేస్తుండడంతో ప్రయాణికులు జంకుతున్నారు. జాతీయ రహదారిని కూడా కోతులు వదలడం లేదు. సత్తుపల్లి మండల శివారులో రోడ్డుపైకి ప్రతిరోజూ కోతులు గుంపులుగుంపులుగా చేరుతున్నాయి. ఆ రోడ్డు మీదుగా ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. వ్యవసాయ భూముల్లోకి కోతులు మందలుగా చేరుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.