ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం భవన్న పాలెం గ్రామంలో ఖరీఫ్ ధాన్య సేకరణ కేంద్రం ఐకెపి ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభోత్సవం చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఐకెపి మండల అధికారులు, ఐకెపి గ్రామ అధికారి అయిన కంచు శివ నాగరాజు, గ్రామ షిరిడి సాయి సమైక్య అధ్యక్షులు పుట్టా నాగమణి, సమైక్య సభ్యులు, హమాలీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.