ఓ యువ జంట తమ పెళ్లిని వినూత్నంగా జరుపుకొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామానగరం గ్రామానికి చెందిన పిల్లి ప్రసన్నకుమార్ ఇంజినీరింగ్ చదివి ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు. ఇటీవల తనకు వివాహం ఫిక్స్ అవగా తన తల్లిదండ్రులను, పెళ్లి చేసుకోబోయే యువతి మనీషాను ఒప్పించి అంబేడ్కర్ సాక్షిగా ఆయన చిత్రపటం ఎదుట ఒకరికొకరు దండలు మార్చుకుని ఒకటయ్యారు. అనంతరం విందు భోజనాలు ఏర్పాటు చేశారు.