ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర అధికారి

70చూసినవారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర అధికారి
ఖమ్మం జిల్లా తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిని సందర్శించి డ్రగ్ స్టోర్, రక్త పరీక్షల ల్యాబ్ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యసేవల విషయంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్