వేంసూరు: గ్రామసభలో అధికారులను నిలదీసిన కాంగ్రెస్ నేతలు

65చూసినవారు
వేంసూరు మండల పరిధిలోని కుంచపర్తి గ్రామంలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలు పారదర్శకంగా నిర్వహించలేదని అధికారులను గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు జమ్ముల కోటిస్వామి బృందం నిలదీశారు. గ్రామాల్లో లేని వారికి, భూములు ఉన్న కొందరు భూస్వాములను ఎంపిక చేశారని వాగ్వాదానికి దిగారు. అధికారులు రీ-సర్వే చేస్తామని అంగీకరించిన తరువాత ఆందోళన కారులు శాంతించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్