ఖమ్మం జిల్లా మధిర టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇటీవల గంపలగూడెం మండలం పెనుగోలను గ్రామానికి చెందిన ఇనపనూరి రమేష్ మధిరలో తన సెల్ ఫోన్ పోయినదని దరఖాస్తు ఇవ్వగా దీనిపై స్పందించిన మధుర టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ సంధ్య శనివారం ఈసీఐఆర్ పోర్టల్ ద్వారా దర్యాప్తు చేపట్టి బాధితునికి తన సెల్ ఫోను ను అందజేశారు. ఈ సందర్భంగా వారు పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.