యూనియన్ బ్యాంక్ ప్రజా సేవలో నిమగ్నం అవడం సంతోషం : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

55చూసినవారు
యూనియన్ బ్యాంక్  ప్రజా సేవలో నిమగ్నం అవడం సంతోషం : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సామాజిక బాధ్యతగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి యూనియన్ బ్యాంక్ ప్రతినిధు లు అంబులెన్సు అందించడం అభినందనీయమని తెలిపారు. యూనియన్ బ్యాంక్ సోషల్ ఫౌండేషన్ ద్వారా సమకూర్చిన అంబులెన్స్ తాళాలను సోమవారం ఆయన ఆస్పత్రి అధికారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యాంకర్ల సహకారంతోనే ప్రభుత్వం రూపొందించే కార్యక్రమాలు విజయవంతం కావడానికి అవకాశముందని తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రజలకు వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలందిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా ఆసుపత్రికి అదనంగా అంబులెన్స్ కావాలని చెప్పగానే సమకూర్చిన యూనియన్ బ్యాంక్ అధికారులు సేవలు అమోఘమని తెలిపారు.

సంబంధిత పోస్ట్