Mar 21, 2025, 17:03 IST/
తెలంగాణ హైకోర్టులో శ్యామలకు బిగ్ రిలీఫ్
Mar 21, 2025, 17:03 IST
యాంకర్ శ్యామలకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దంటూ శ్యామల దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. శ్యామలను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. కేవలం నోలీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని తెలిపింది. సోమవారం పోలీసు విచారణకు హాజరుకావాలని ఆమెకు సూచించింది. పోలీసుల విచారణకు సహకరించాలని శ్యామలను హైకోర్టు ఆదేశించింది.