ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రమైన వైరా మండలంలో శనివారం 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ద్వారకా నగర్ 1, గం డగల పాడు 1,సంత బజార్ 1, సత్రం బజార్ 1, 5వ వార్డులో ఒకటి, సోమవారం లో ఒకటి, గన్నవరంలో ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారులు పేర్కొన్నారు.