కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపాన అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురి నుంచి రూ. 2 లక్షలు విలువైన 8. 5 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పల్లిపాడు సమీపంలో ఆర్టీసీ బస్సులను తనిఖీ చేస్తుండగా భద్రాచలం నుండి ఖమ్మం వెళ్లే బస్సు నుంచి చంద్రబాబు, అఫ్రోజ్, అజిజ్ కిందకు దిగారు. వారిని గుర్తించి తనిఖీ చేయగా గంజాయి లభించింది. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ మమత తెలిపారు.