కారేపల్లి మండల కేంద్రంలో హనుమాన్ జయంతి వేడుకల ర్యాలీ

56చూసినవారు
కారేపల్లి మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్ నుంచి ప్రారంభమైన సైకిల్ మోటార్ ర్యాలీ కారేపల్లి గ్రామంలో నిర్వహిస్తూ జైశ్రీరామ్, జై శ్రీ హనుమాన్ అంటూ నినాదాలతో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తురక నారాయణ, జంగం వెంకటేశ్వర్లు, పేరున్ని వెంకటేశ్వర్లు, బుచ్చిబాబు, ఓరుగంటి రాజు, కొండపల్లి ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్