కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయ కుమారి అధ్యక్షతన కారేపల్లి ఎస్సై రాజారామ్ డ్రగ్స్ పై జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ కు విద్యార్థులు దూరంగా ఉండాలని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. డ్రగ్స్ మహమ్మారికి విద్యార్థులు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజారామ్, ప్రిన్సిపాల్, పోలీసు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.