ఖమ్మం డిఆర్ఓ చాందావత్ సురేష్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా అధ్యక్షులు దుర్గ ప్రసాద్ మంగళవారం ఆయన మృతికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామ్మూర్తి, ఎస్సీ సెల్ అధ్యక్షులు మేదరి టోనీ, తదితరులు పాల్గొన్నారు.