ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో వరద ముప్పు లేనందున ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలను కొనసాగించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో సూచించారు. ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో మాత్రమే స్కూళ్లకు ఈనెల 6వరకు సెలవులు ప్రకటించామని. ఆపై 7న వినాయకచవితి, 8న ఆదివారం కావడంతో 9వ తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకుంటాయని తెలిపారు. ఈ విషయాన్ని విద్యాసంస్థలు గమనించాలని సూచించారు.