సింగరేణి మండల కేంద్రంలో జిల్లా మైనార్టీ నాయకులు, మాజీ వార్డు సభ్యులు ఎస్కే గౌసుద్దీన్ గురువారం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని బీసీ కాలనీ ఆడపడుచులకు చీరలు పండుగల కానుకగా అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా నిలవాలని, పేద కుటుంబాలకు కష్టాలలో అండగా నిలుస్తానని తెలిపారు. చీరలు పంపిణీ చేసిన గౌసుద్దీన్ కు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.