వైరా: బీఎస్పీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతి

55చూసినవారు
జూలూరుపాడు మండల కేంద్రంలో నెలకొన్న పలు సమస్యలపై శుక్రవారం బిఎస్పి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కు నాయకులు వినతిపత్రం అందించారు. మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్, బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని నాయకులు ఎమ్మెల్యేకు తెలిపారు. తక్షణమే చొరవ తీసుకొని నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు బీఎస్పీ నాయకులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్