జూలూరుపాడు: రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి గోలి మసూదన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం జూలూరుపాడులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు రుణమాఫీ, భరోసా వంటి హామీలు విఫలమయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే డిసెంబర్ 1 నుంచి ఆందోళనలు ప్రారంభిస్తుందని హెచ్చరించారు. మండల బీజేపీ నాయకులు చిలుకూరి రమేష్ ఉన్నారు.